: విశాఖ ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో ఐదుగురు గల్లంతు


విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో ఐదుగురు గల్లంతయ్యారు. శ్రావణ్, శేషు, ప్రసాద్, బాబర్, సీతన అనే ఐదుగురు సముద్ర స్నానానికని వెళ్లారు. సముద్రంలోకి దిగిన వీరు ఎంతకీ బయటకు తిరిగి రాలేదు. గల్లంతైన వారు ఫిషింగ్ హార్బర్ వద్ద ఉన్న ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News