: ప్రత్యేకహోదాపై ఒత్తిడితో కూడిన సంప్రదింపులు కొనసాగిద్దాం: మంత్రులతో చంద్రబాబు
ఏపీకి ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన చట్టం హామీల విషయమై కేంద్రంపై ఒత్తిడితో కూడిన నిరంతర సంప్రదింపులు కొనసాగిద్దామని మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలో మంత్రులతో, ముఖ్యనేతలతో చంద్రబాబు ఈరోజు భేటీ అయ్యారు. బీజేపీతో తమ పార్టీ వైఖరి ఎలా ఉండాలనే అంశంపై కూడా చర్చించారు. ఇప్పటివరకు అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి ఇచ్చిందేమిటి? విభజన చట్టం హామీల ప్రకారం ఏపీకి ప్రత్యేకంగా ఇచ్చిందేమిటి? అనే వాటిపై విడివిడిగా నివేదికలు తయారు చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. ఈ భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, నేతలు కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.