: ఇళయరాజాతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది: కమలహాసన్


ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతో కలిసి పనిచేయడం చాలా సరదాగా ఉంటుందని ప్రముఖ నటుడు కమలహాసన్ అన్నారు. కమల్ తాజా త్రిభాషా చిత్రం ‘శభాష్ నాయుడు’కు ఇళయా రాజా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కమల్ ఒక ట్వీట్ చేశారు. ఇళయరాజాతో కలిసి పనిచేయడం భలే సరదాగా ఉంటుందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో కమల్ సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మలయాళ దర్శకుడు రాజీవ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో తెరకెక్కించనున్నారు.

  • Loading...

More Telugu News