: మహేష్ ఆదర్శంగా నిలిచారు: ఎంపీ గల్లా జయదేవ్


బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్న సినీ నటుడు మహేష్ బాబు ఆదర్శంగా నిలిచారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మహేష్ బాబు దత్తత గ్రామంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రూ.2 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. బుర్రిపాలెంలోని ప్రతి గ్రామానికి హెల్త్ కార్డు అందజేయనున్నట్లు జయదేవ్ చెప్పారు. కాగా, మహేష్ ను చూసేందుకు అభిమానులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మహేష్ కు రక్షణగా 70 మంది బౌన్సర్లు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News