: బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీఎం భార్యకు నోటీసులు
భారతీయ జనతా పార్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మేఘాలయ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా భార్య డికాంచీ డి షిరా కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో కోరారు. ఈ నెల 16న జరగనున్న ఉప ఎన్నికల ప్రచారం కోసం ఆయా సభల్లో పాల్గొన్న ఆమె బీజేపీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలను మీడియా నుంచి నేరుగా సుమోటోగా స్వీకరించిన ఎన్నికల సంఘం ఆమెకు నోటీసులు పంపింది. ఈ విషయమై సంగ్మా భార్య మాట్లాడుతూ, స్థానిక భాష మీడియాకు అర్థంగాకపోవడంతో తప్పుగా రాసిందని, అటువంటి వ్యాఖ్యలు తాను చేయలేదని అన్నారు.