: పిల్లాడనుకుని ముద్దులు కురిపించిన తర్వాత తెలిసింది అతను పెద్దోడని!


అల్టిమో లింగరీస్ చైన్ యజమాని మిచెల్లీ మూన్ కు ఊహించని అనుభవం ఎదురైంది. తన వ్యాపార విస్తరణతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకుగాను నిన్న వియత్నాం వెళ్లింది. ఈ సందర్భంగా దాదాపు 3000 మంది ప్రతినిధులను ఉద్దేశించి ఆమె మాట్లాడేందుకని అక్కడ ఏర్పాటు చేసిన ఒక వేదికపైకి ఎక్కింది. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలుకుతూ ఒక చిన్నోడు ఫ్లవర్ బొకేను ఇచ్చాడు. దీంతో మురిసిపోయిన మిచెల్లీ ఆ పిల్లాడిని ఎత్తుకుని ముద్దుల వర్షం కురిపించింది. సెల్ఫీలు కూడా దిగింది. ఇదంతా జరుగుతుండగా, ‘ప్లీజ్, నా భర్తను కిందకు దింపడి’ అంటూ ఒక మహిళ ఆమెను అభ్యర్థించింది. దీంతో, మిచెల్లీకి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది.. తాను ఎత్తుకున్నది పిల్లాడిని కాదని, 46 ఏళ్ల సంవత్సరాల వయస్సున్న మరుగుజ్జు వ్యక్తినని. ఈ విషయాన్ని మిచెల్లీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా లో పేర్కొంది.

  • Loading...

More Telugu News