: మోదీకి దమ్ముంటే సోనియాను అరెస్టు చేయాలి: కేజ్రీవాల్ సవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలను వదలడం లేదు. పార్లమెంటులో రెండు పార్టీలు విమర్శలు సంధిస్తున్న అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరిని ఆయన తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అవినీతికి పాల్పడిందని బీజేపీ పార్లమెంటు సాక్షిగా చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఆమెను అరెస్టు చేయాలని ఆయన సవాల్ విసిరారు. ప్రధాని మోదీకి సంబంధించిన కీలక అస్త్రాలు సోనియా గాంధీ చేతిలో ఉన్నాయని, అందుకే ఆయన సోనియాను అరెస్టు చేయలేకపోతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. అలా కాకుంటే ఆయన పార్టీకి చెందిన వారే ఆరోపణలు చేస్తున్నప్పుడు ఆమెను అరెస్టు చేయాలని ఆయన మోదీకి సవాలు విసిరారు. చూస్తుంటే ఈ కుంభకోణంలో మోదీకి కూడా సంబంధం ఉందన్న అనుమానం వస్తోందని ఆయన ఆరోపించారు.