: ‘యాపిల్’ ఇండియాకు కొత్త మేనేజర్!


‘యాపిల్’ ఇండియా కొత్త మేనేజర్ గా సంజయ్ కౌల్ ను నియమించనున్నట్టు సమాచారం. కెనడా పౌరుడు అయిన కౌల్ 2011 నవంబర్ నుంచి యాపిల్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ‘యాపిల్’ ఇండియాకు మేనేజర్ గా ఉన్న మనీష్ ధిర్ జనవరిలో కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బాధ్యతలను సంజయ్ కౌల్ కు అప్పజెప్పనున్నట్లు సమాచారం. కాగా, బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ(టెక్) ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కౌల్, 1988లో గుస్తవ్ సన్ స్కూల్ బిజినెస్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ లో బీఏ పట్టా అందుకున్నాడు. అనంతరం 2008లో ఆయన భారత్ కు తిరిగివచ్చారు. యాపిల్ ఐఫోన్ల బిజినెస్ ను సంజయ్ కౌల్ చూసుకునేవారు. ‘యాపిల్’ లో చేరకముందు, బ్లాక్ బెర్రీకి కెపాసిటీ డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. ఎయిర్ టెల్ బ్లాక్ బెర్రీ బిజినెస్ ను వృద్ధి చేయడంలో సంజయ్ కీలక పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News