: నేనో చెడ్డ కొడుకునని మా అమ్మ భావన: దర్శకుడు వర్మ
ఈ రోజు మాతృదినోత్సవం. తల్లికి పిల్లలు శుభాకాంక్షలు చెప్పేరోజు. అయితే, ఈరోజున తన తల్లికి శుభాకాంక్షలు చెప్పనని ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో ఒక ట్వీట్ చేశాడు. ‘నేనో చెడ్డ కొడుకునని మా అమ్మ భావన. మంచి తల్లి ఎప్పుడూ చెడ్డ కొడుకు నుంచి శుభాకాంక్షలు కోరుకోదు. అందుకే, మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెప్పను’ అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.