: ఆ బాలీవుడ్ లవర్స్ బ్రేకప్ కి కారణం 'వన్' హీరోయినా?


ఏడేళ్ల సుదీర్ఘ ప్రేమ కథకు బ్రేక్ పడడంలో 'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన హీరోయిన్ కృతి సనోన్ కారణమని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అంకితా లోఖండే ప్రేమ బంధం బీటలు వారడానికి కారణం కృతి సనోన్ అని బాలీవుడ్ లో వార్తలు వెలువడ్డాయి. టీవీ నటులుగా అరంగేట్రం చేసిన సుశాంత్, అంకిత సుదీర్ఘకాలంగా ప్రేమలో ఉన్నారు. గతంలో హీరోయిన్లతో ఘాటు సీన్లలో నటించినా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయని అంకిత, ఈ మధ్య కాలంలో సుశాంత్ లో మార్పు గమనించిందని తెలుస్తోంది. కృతి సనోన్ తో 'రాబ్తా'లో సుశాంత్ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేస్తున్నాడు. సుశాంత్ వరుసగా పోస్టు చేస్తున్న ఈ ఫోటోల్లో వారిద్దరి మధ్య అనుబంధం స్పష్టమవుతుండడంతో అంకిత, సుశాంత్ మధ్య పొరపొచ్చాలు చోటుచేసుకున్నాయని, దీంతోనే వారిద్దరూ సుదీర్ఘ ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పుకున్నారని బాలీవుడ్ పేర్కొంటోంది. అసలు ఏం జరిగిందన్నది వారు ముగ్గురికే తెలియాలి.

  • Loading...

More Telugu News