: ప్రతి పార్టీకి రహస్య ఎజెండాలున్నాయి...వాటి కారణంగానే ఏపీకి అన్యాయం జరిగింది: దాడి వీరభద్రరావు


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీకి హోదా లేదని చెబుతూ వచ్చిందని అన్నారు. హోదా ఇవ్వం, ప్యాకేజీ ఇస్తామని బీజేపీ ఆది నుంచి చెబుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ, టీడీపీ ఈ విషయంలో ప్రజలను మభ్యపెడుతూ వచ్చాయని ఆయన తెలిపారు. నిజంగా ఏపీకి హోదా ఇవ్వాలని వుంటే బీజేపీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం పెద్ద విషయం కాదని ఆయన అన్నారు. బీజేపీకి హోదా ఇవ్వాలనే ఆలోచన లేనప్పుడు 'నీతిఆయోగ్' అంటూ సాకులు చెబుతోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ ప్రతి పార్టీకి రహస్య ఎజెండాలు ఉన్నాయని, వాటిని అమలు చేసుకునేందుకు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఆ కారణంగానే ఎపీకి అన్యాయం జరుగుతోందని ఆయన చెప్పారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే భవిష్యత్ లో రాజకీయ నాయకులను నమ్మే పరిస్థితి ఉండదని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News