: సత్తా చాటిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్...ఢిల్లీపై గెలుపు


ఐపీఎల్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు స్ఫూర్తిమంతమైన విజయం సాధించింది. మోహాలీ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 9 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 181 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి డికాక్ (52), సంజు శాంసన్ (49) శుభారంభం ఇచ్చారు. ఆ తరువాత కరుణ్ నాయర్ (23) నెమ్మదిగా ఆడగా, బిల్లింగ్ (6), బ్రాత్ వైట్ (16) లను కీలక సమయంలో పెవిలియన్ కు పంపడంతో ఒత్తిడి పెరిగింది. దీంతో 12 బంతుల్లో 28 పరుగులు చేయాల్సిన దశలో మోరిస్ (17), రిషబ్ పంత్ (4) ఒత్తిడి కారణంగా 19వ ఓవర్ లో కేవలం 3 పరుగులు, చివరి ఓవర్ లో 15 పరుగులు మాత్రమే సాధించగలగడంతో పంజాబ్ జట్టు ఢిల్లీపై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు చోటుచేసుకోనప్పటికీ కీలక మ్యాచ్ లో విజయం సాధించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచుతుందనడంలో సందేహం లేదు.

  • Loading...

More Telugu News