: వరుణుడు కరుణించడంతో హైదరాబాదీల్లో ఆనందం
హైదరాబాదులో ప్రస్తుతం ఎండాకాలానికి బదులుగా వానాకాలం నడుస్తోంది. గత వారం వరకు సూర్యుడు భగభగలాడి హైదరాబాదీలను బెంబేలెత్తించాడు. దీంతో ఎండల వేడికి తట్టుకోలేకపోయిన నగర వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. నగరవాసుల కష్టాలను చూసి కరుణించిన వరుణుడు గత మూడు రోజులుగా హైదరాబాదులో మకాం వేశాడు. దీంతో హైదరాబాదీల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గత మూడురోజులుగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో యువతలో హర్షం వ్యక్తమవుతోంది. సోషల్ మీడియా నిండా వర్షానికి సంబంధించిన ముచ్చట్లే చోటుచేసుకుంటున్నాయి. మేనెల ఎండలతో మాడిపోతామని భావించిన ప్రజలను చిరుజల్లులు పలకరిస్తుండడంతో అంతా ఆనందంలో మునిగిపోయారు.