: భారత్ లో ఓ మైనారిటీని మేయర్ గా ఎన్నుకోవడం జరుగుతుందా?: ఒమర్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు


జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీనగర్ లో ఆయన మాట్లాడుతూ, లండన్ మేయర్ గా సాదిక్ ఖాన్ ఎన్నిక సంచలన విజయమని అన్నారు. ఆయన విజయంతో మైనారిటీలు కూడా విజయం సాధించొచ్చని నిరూపించారని ఆయన పేర్కొన్నారు. భారత్ లో ఓ మైనారిటీ వ్యక్తిని మేయర్ గా ఎన్నుకోవడం సాధ్యమవుతుందా? అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా, పాకిస్ధాన్ కు చెందిన సాదిక్ ఖాన్ లండన్ మేయర్ గా నిన్న ఎన్నికయ్యారు. కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థి గోల్డ్ స్మిత్ పై 9 పాయింట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయనకు పాకిస్ధాన్, భారత్ లోని మైనారిటీల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News