: సన్నగా ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారట!
సన్నగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని హార్వార్డ్, టఫ్ట్స్ యూనివర్సిటీలు మనిషి జీవపరిణామ క్రమం, మరణాల మధ్య సంబంధాలపై పరిశోదనలు చేశాయి. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ పరిశోధనల కోసం వారు 80,266 మంది మహిళలను, 36,622 మంది పరుషులను పరీక్షించారు. వీరంతా 5, 10, 15, 20, 30, 40 ఏళ్లప్పుడు వారి శరీరాకృతులు ఎలా ఉండేవో పరిశోధకులకు వివరించారు. 50 ఏళ్ల వయసులో వారి శరీరద్రవ్య రాశి సూచీ (బీఎంఐ)ని వారు రూపొందించారు. వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత మళ్లీ వారిపై పరిశోధనలు చేశారు. సన్నగా ఉన్న మహిళల్లో 60 ఏళ్లు దాటిన తరువాత మరో 15 ఏళ్ల లోపల మరణించే అవకాశాలు కేవలం 11 శాతంగా ఉండగా, పురుషుల్లో మాత్రం 20.3 శాతం మరణించే అవకాశం ఉంది. అదే లావుగా ఉన్న పురుషుల్లో ఆ వయసులో మరణించే అవకాశం 24.1 శాతం, మహిళల్లో 19.7 శాతం ఉంది.