: ఇండోర్ విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం.. ప్రయాణికులు క్షేమం
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ విమానాశ్రయంలో శనివారం సాయంత్రం ఓ పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఢిల్లీ నుంచి ఇండోర్ కు వచ్చిన జెట్ ఎయిర్ వేస్ విమానం 9డబ్ల్యూ-2793 విమానాశ్రయం రన్ వేపై దిగి వెళుతున్న క్రమంలో జారి పక్కకు వెళ్లిపోయింది. ఈ ఘటనలో 66 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది క్షేమంగా బయటపడినట్టు జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. విమానం నుంచి అందరినీ సురక్షితంగా కిందకు దింపి టెర్మినల్ కు తీసుకెళ్లినట్టు తెలిపింది.