: ర్యాంపుపై వయ్యారాలు ఒలకబోసిన గోమాతలు


అందమైన భామలు ర్యాంపులపై క్యాట్ వాక్ చేయడం చూసే ఉంటారు. ఆ మాటకొస్తే అందాల ప్రదర్శన భామలకు మాత్రమేనా.. గో మాతలకు ఎందుకు ఉండరాదు అన్నట్టు హర్యానాలోని రోహ్ తక్ లో శనివారం ఆవులు, ఎద్దులు ర్యాంపుపై కాటిల్ వాక్ చేశాయి. బోవిన్ బ్యూటీ పేజెంట్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమం హాజరైన వేలాది మంది అతిథులకు వినోదాన్ని పంచింది. యజమానులు తమ పశువులను తీసుకుని ఒకదాని తర్వాత ఒకదాన్ని ప్రదర్శిస్తూ వెళుతుంటే సందర్శకులు కేరింతలు కొట్టగా... న్యాయమూర్తులు మాత్రం మార్కులు వేసే పనిలో మునిగిపోయారు. దేశవాళీ పశుసంపద గురించి తెలియజేయడంతోపాటు వాటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఆవు లేదా ఎద్దు ఎంత పరిమాణంలో ఉంది?, వాటి ఆరోగ్యం, చూడ్డానికి రూపు రేఖలు ఎలా ఉన్నాయి?, వాటి కొమ్ముల పొడవు ఎంత?, ఆవులు అయితే అవి ఎంత మేర పాలిస్తున్నాయి? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని న్యాయమూర్తులు మార్కులు వేసేశారు. మొత్తం వివిధ విభాగాలకు కలిపి 18 పశువులను విజేతలుగా నిర్ణయించారు. మొత్తానికి ఈ ప్రదర్శనకు 630 ఆవులు, ఎద్దులు తరలి వచ్చాయి. హర్యానాలో రోహ్ తక్ పశుసంపదకు పెట్టింది పేరు.

  • Loading...

More Telugu News