: తండ్రి కోరుకున్నదాని కంటే గొప్పగా మహేష్ బాబు ఉన్నాడు: పరుచూరి బ్రదర్స్
ప్రపంచంలోని ఏ తండ్రి అయినా తన కుమారుడు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటారని, మహేష్ బాబు ఎంత గొప్పగా ఉండాలని కృష్ణ గారు కోరుకున్నారో అంతకంటే గొప్ప స్థాయిలోనే ఉన్నాడని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'ఈనాడు' సినిమాలో నటించాలని కృష్ణ గారిని అడిగినప్పుడు మొదట్లో పాటల్లేవు, ఫైటుల్లేవు తానేం నటిస్తానని అన్నారని గుర్తు చేసుకున్నారు. అరగంట కథ విన్న తరువాత తన 200వ సినిమా ఈనాడు అని అనౌన్స్ చేశారని అన్నారు. తమకు అలా కృష్ణ గారు జీవితం ఇచ్చారని ఆయన తెలిపారు. ఆయన సోదరుడు వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ, గతంలో కేఎస్ఆర్ స్కూలు, విఠలాచార్య స్కూలు ఇలా ఉండేవని, అవి మూతపడి చాలా కాలమైందని, తెలుగు సినిమాల్లో శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం తరువాత స్కూలు తెరిచాడని అన్నారు. ఆయన మానవతా విలువలు, ప్రేమాప్యాయతలు, సంప్రదాయాలు ఇలా ఆ స్కూల్లో నేర్పుతారని ఆయన ప్రశంసించారు.