: పెద్దపెద్ద ఆర్టిస్టులుండేసరికి బెరుకుండేది... మహేష్ నవ్వు నడిపించింది: శ్రీకాంత్ అడ్డాల


బ్రహ్మోత్సవం సినిమా ప్రకటన అయితే చేశాను కానీ, లోపల భయంగా ఉండేదని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపాడు. ఆడియో వేడుకలో మాట్లాడుతూ, ఈ సినిమాలో పెద్దపెద్ద ఆర్టిస్టులు ఉండడం, ప్రతి ఫ్రేమ్ లో పెద్ద ఆర్టిస్టులు కనపడడంతో భయంగా, బెరుగ్గా ఉండేదని అలాంటి సమయంలో మహేష్ బాబును చూస్తే ఆయన ఓ నవ్వు నవ్వేవారని, అది అలా తనను నడిపించిందని అన్నాడు. ఈ సినిమా అనుకున్నప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి వెంకటేశ్వరస్వామి పాదాలను గుర్తు చేసుకున్నానని, ఆయన పాదాలు చూసినప్పుడు ఎంత వినయంగా ఉంటామో, అంతే వినయంగా సినిమా పూర్తయ్యేవరకు ఉండాలని భావించానని, ఈ సినిమాకు పని చేసిన అందరికీ ధన్యవాదాలని చెప్పాడు. ఈ సినిమా బ్రహ్మోత్సవంలా మంచి విజయం సాధిస్తుందని శ్రీకాంత్ ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News