: నాకు తెలుగే రాలేదు...ఇక ఇంగ్లీష్ ఎలా వస్తుంది?: సత్యరాజ్
తనకు తెలుగే సరిగ్గా రాదని, ఇక ఇంగ్లీషు ఎలా వస్తుందని తన ప్రొఫెసర్ ను అడిగానని ప్రముఖ నటుడు సత్యరాజ్ తెలిపారు. బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా తీర్చిదిద్దారని అన్నారు. ఈ సినిమా ఒక పండగలా ఉంటుందని అన్నారు. భారీ తారాగణంతో సినిమా చాలా రిచ్ గా ఉంటుందని అన్నారు. తెలుగు మాట్లాడడం తనకు కొంచెం కష్టమని అన్నారు. దీంతో 'మీరు తమిళంలో మాట్లాడండి. నేను తెలుగులో ట్రాన్స్ లేట్ చేస్తా'నని నవదీప్ చెప్పాడు. దీంతో సత్యరాజ్ చెబుతూ, "నేను బీఎస్సీ చదువుతుండగా ఒకరోజు ఇంగ్లీష్ లెక్చరర్ పిలిచి, నీకు ఇంగ్లిష్ ఎందుకు రాదు? అని అడిగారు. దానికి మాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు భాషే రాదని, ఇక వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంగ్లిష్ ఎలా తెలుస్తుందని సమాధానం చెప్పాను" అనడంతో అంతా పెద్ద పెట్టున నవ్వేశారు.