: వినూత్న ఆహ్వానం...మేళతాళాలతో మహేష్ కుటుంబానికి స్వాగతం
'బ్రహ్మోత్సవం' ఆడియో వేడుక వేదిక వద్దకు ఆ సినిమా హీరో ప్రిన్స్ మహేష్ బాబు చేరుకున్నారు. హైదరాబాదులోని జేఎఫ్ సీ కన్వెన్షన్ సెంటర్ కు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో చేరుకున్న మహేష్ బాబుకు నిర్మాత మేళతాళాలతో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కాగా, మహేష్ వేదిక వద్దకు చేరుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. దీంతో కేరింతలు కొట్టారు. కాగా, ఆడియో వేడుకను భారీ ఎత్తున ఓ ఉత్సవంలా నిర్వహించడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.