: పాలేరు ఉప ఎన్నికకు ప్రత్యేక పరిశీలకులు... అత్యాధునిక టెక్నాలజీ


ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ఎక్కడా ఎలాంటి ఆరోపణలకు, అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో పాటు, ప్రత్యేక పరిశీలకులను నియమిస్తోంది. పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 16న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల పరిశీలకులుగా ముగ్గురిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఆదేశాలు వెలువరించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎప్, ఐఆర్ఎస్ అధికారులు పళని స్వామి, దల్వీర్ సింగ్, శరవణ్ కుమార్ లను పరిశీలకులుగా నియమించింది. ఇక, నియెజకవర్గ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీవీ పీఏటీ మెషిన్లను అమర్చుతున్నట్టు జిల్లా కలెక్టర్ దాన కిషోర్ వెల్లడించారు. దీని ద్వారా ఓటర్లు తాము ఎవరికి ఓటేశామో తెలుసుకునే వీలుంటుందని చెప్పారు. పాలేరు ఉప ఎన్నిక బరిలోకి మంత్రి తుమ్మల పోటీకి దిగడంతో అధికార టీఆర్ఎస్ సర్కారు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందంటూ, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లోగడ వినతిపత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను బదిలీ చేసి వారి స్థానంలో కొత్త వారిని నియమించిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News