: విశాఖ చేరుకున్న బాలయ్య.. కదిలిన కార్యకర్తల దండు


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు 2012 అక్టోబర్2 గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లాలో ప్రారంభించిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర ఈ రోజు సాయంత్రం విశాఖలో ముగుస్తుంది. ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు సినీ నటుడు బాలకృష్ణ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశాఖకు బయల్దేరారు. పాదయాత్ర కోసం 11 రైళ్లను ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్, తిరుపతి నుంచి ఈ రైళ్లు ఉంటాయి.

  • Loading...

More Telugu News