: మహేష్ తో ప్రయాణం మర్చిపోలేం... మరో అవకాశం ఇస్తే వదులుకోం: నిర్మాత పొట్లూరి వరప్రసాద్


'బ్రహ్మోత్సవం' సినిమా ద్వారా మహేష్ బాబుతో కలిసి ప్రయాణించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఈ సినిమా నిర్మాత పొట్లూరి వరప్రసాద్ తెలిపారు. హైదరాబాదులోని జేఎఫ్ సీ కన్వెన్షన్ సెంటర్ లో ఆడియో వేడుక వేదిక వద్ద ఆయన మాట్లాడుతూ, ఉత్సవాల్లో పెద్ద ఉత్సవం 'బ్రహ్మోత్సవం' అని ఎలా భావిస్తామో ఈ సినిమా ఆడియో వేడుక కూడా అలాగే నిర్వహించాలని భావించామని అన్నారు. అందుకే భారీ ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. అశేషమైన అభిమాన జనం కలిగిన మహేష్ బాబు సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, మహేష్ బాబు సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో ఆయన పక్కన ఎవరు బాగున్నారంటూ ఓ కాంటెస్టె పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. మహేష్ బాబుతో ఈ సినిమా నిర్మించడం ద్వారా కలిగిన అనుభూతి ఏంటంటే...ఆయనతో ఈ ప్రయాణం ఎంతో ఆనందాన్నిస్తే...ఆయన మళ్లీ అవకాశం ఇస్తే వదులుకోకూడదనే అభిప్రాయం కల్పించిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News