: వైజాగ్ ఎంత అద్భుతం!... క్రికెటర్ భజ్జీ ట్వీట్


వైజాగ్ అందాలకు ఫిదా అయిన క్రికెటర్లలో ఇప్పుడు భజ్జీ కూడా చేరాడు. ఈ నెల 8న విశాఖ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం హర్భజన్ సింగ్ విశాఖ చేరుకుని సాగర తీరం వెంటే ఉన్న ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేశాడు. ఆ హోటల్ నుంచి సాగర అందాలను చూసి మంత్ర ముగ్ధుడయ్యాడు. ఇంకెందుకు ఆలస్యం అనుకుని మొబైల్ ఫోన్ లో సాగర అందాలను బంధించి ఆ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ‘ఇది వైజాగా లేక డర్బనా...? ఇది వైజాగే గైస్. నా రూమ్ నుంచి తీసిన అద్భుత దృశ్యం ఇది’ అని కేప్షన్ పెట్టేశాడు. లోగడ భారత జట్టు కెప్టెన్ ధోనీ కూడా వైజాగ్ అందాలకు ముగ్ధుడైన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News