: ఆరాధ్య ఆటగాడు సంతకం చేసి ఇచ్చిన బ్యాట్ తో ఉతికేసిన రహానే!


ఏదైనా రంగంలో మనం ఆరాధించేవారు నేరుగా వచ్చి ప్రోత్సహించినా లేదా వారికి సంబంధించిన ఓ జ్ఞాపకం తు నిరంతరం స్పూర్తిని పెంచినా వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే...బెంగళూరు వేదికగా రైజింగ్ పూణే సూపర్ జయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం రెండు జట్లకు అవసరం. బెంగళూరు గెలిస్తే నాకౌట్ రేసులో నిలిచేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో జట్టులో కీలక ఆటగాళ్లంతా గాయాలపాలై ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న ధోనీకి ఈ విజయం అత్యంత అవసరం. ఈ నేపథ్యంలో టాస్ ఓడిన పూణే బ్యాటింగ్ ప్రారంభించాలి. మ్యాచ్ గెలవాలంటే రాణించాల్సిన అవసరం ఉందని గుర్తించిన రహానే, తన ఆరాధ్య క్రికెటర్, టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ సంతకం చేసి ఇచ్చిన బ్యాటుతో క్రీజులో అడుగుపెట్టాడు. మంచి బంతులను జాగ్రత్తగా ఆడిన రహానే, చెత్త బంతులను శిక్షించాడు. ఇలా కేవలం 48 బంతులాడిన రహానే 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేశాడు. ఆటగాళ్లంతా విఫలమైనా రహానే దూకుడుగా ఆడడం విశేషం.

  • Loading...

More Telugu News