: భార్యలో ఈ తేడాలు గమనిస్తే భర్త జాగ్రత్త పడాల్సిందే!
సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉంటాయి. ఈ విభేదాలు తార స్థాయికి చేరితే బంధం బీటలు వారుతుంది. ఇలాంటి ప్రమాదం జరగకముందే గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో నిర్వహించిన ఓ సర్వేలో పలు అంశాలు వెలుగు చూశాయని పరిశోధకులు చెప్పారు. భర్తపై తీవ్ర స్ధాయిలో అసంతృప్తి ఉంటే ఆమెలో విపరీత ధోరణి కనబడుతుందని వారు తెలిపారు. వీరు దైనందిన కార్యక్రమాలను అస్సలు పట్టించుకోరని చెప్పారు. ఎక్కువగా నిద్రపోతారు. నిత్యం ఏదోఒకటి ఆలోచిస్తూ గడుపుతారు. భర్త పక్కన పడుకున్నా నిత్యం ఆలోచిస్తూ తెల్లవారుజామున కునుకుతీస్తారు. వారు ఎక్కువ ఒత్తిడి అనుభవిస్తారు. ఆ ఒత్తిడితో చిన్న విషయానికి కూడా తీవ్రంగా స్పందిస్తారు. అధిక ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. భర్తపై కోపం, అసంతృప్తి, అతనితో గడపడం పట్ల విరక్తి ఉన్న మహిళలు వివాహేతర సంబంధానికి ప్రయత్నిస్తారని తేలింది. 40 శాతం అక్రమ సంబంధాలు భర్తపై అసంతృప్తితోనే ఏర్పడతాయని సర్వేలో వెల్లడైందని నిపుణులు వెల్లడించారు. ప్రేమతో మాట్లాడే మాటలకు, విరక్తితో మాట్లాడే మాటలకు తేడా సలువుగానే తెలుస్తుందని, వారిద్దరూ ఎంత సేపు మాట్లాడారన్న విషయం కూడా వారి బంధాన్ని సూచిస్తుందని వారు తెలిపారు.