: హైదరాబాద్‌లో గాలివాన బీభత్సం.. పలుచోట్ల వడగళ్లవాన


హైద‌రాబాదీయులు గత మూడు రోజుల నుంచి భారీ వ‌ర్షాల్ని చూస్తున్నారు. ఈరోజు రాజేంద్రనగర్, బంజారా హిల్స్, జూబ్లిహిల్స్‌, శంషాబాద్ ప్రాంతాల్లో కురిసిన భారీ వ‌ర్షంతో వాహ‌న‌దారులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇక్క‌ట్ల‌ను ఎదుర్కున్నారు. వ‌రుణుడు సృష్టించిన బీభ‌త్సానికి రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌య‌మయ్యాయి. పలుచోట్ల వడగళ్లు పడ్డాయి. ప‌లు ప్రాంతాల్లో కాసేపు విద్యుత్ ప్ర‌సారాన్ని నిలిపివేశారు. మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News