: గుంటూరులో మూడేళ్ల బాలుడు కిడ్నాప్
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. లాలాపేటలో బట్టల షాపు నిర్వహించే శివనాగేశ్వరరావు, సుభాషిణి దంపతులకు రేవంత్ అనే మూడేళ్ల బాలుడున్నాడు. నేటి సాయంత్రం బట్టల షాపుకు వచ్చిన ఓ యువకుడు బట్టలు చూపించమని అడిగాడు. ఇంతలో రేవంత్ ఏడుపు లంకించుకోవడంతో అతనిని సముదాయించే పేరుతో బాలుడ్ని తీసుకుని ఆ యువకుడు బైక్ పై ఉడాయించాడు. దీంతో లబోదిబోమంటూ రేవంత్ తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ కోసం గాలింపు చేపట్టారు.