: చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగు దేశం పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈరోజు మరో వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం గూటికి చేరుకున్నారు. కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. మోహన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు, మద్దతు దారులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీని వీడుతున్నట్లు నిన్న మోహన్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. చంద్రబాబు రాయలసీమ పర్యటనలో భాగంగా ఈరోజు కర్నూలులో నీరు- చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో తన నియోజక వర్గంలోనే ఎస్వీ మోహన్‌రెడ్డి పార్టీ మారారు.