: నేను బాగానే వున్నాను... ఆ వార్తలు నమ్మకండి!: సినీ హాస్యనటుడు సెంథిల్


అరుణాచ‌లం, జెంటిల్మన్, నరసింహా వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో క‌నిపించి న‌వ్వులు పూయించిన తమిళ హాస్యనటుడు సెంథిల్ మృతి చెందాడంటూ నిన్న ఇంట‌ర్నెట్ లో పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై స్వయంగా సెంథిల్ స్పందిస్తూ.. ఓ వీడియో సందేశాన్ని విడుద‌ల చేశారు. తాను చాలా ఆరోగ్యంగానే ఉన్న‌ట్లు, ఇంట‌ర్నెట్‌లో తాను చ‌నిపోయిన‌ట్లు వ‌స్తోన్న వార్త‌ల‌ను అభిమానులు నమ్మొద్దంటూ తెలిపారు. ‘సోష‌ల్ మీడియాలో నేను చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి, నేను చాలా బాగున్నా’నని ఆయ‌న వీడియో ద్వారా చెప్పారు. దాదాపు 500 చిత్రాల్లో న‌టించిన సెంథిల్‌.. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలుకుతున్నారు. రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

  • Loading...

More Telugu News