: డబ్బుతో పట్టుబడ్డ తమిళ సినీ హీరో శరత్ కుమార్
ప్రముఖ తమిళ సినీ నటుడు శరత్ కుమార్ డబ్బుతో పట్టుబడి కలకలం రేపాడు. తమిళనాడులో ఆల్ ఇండియా మక్కల్ కట్చి పార్టీ అధ్యక్షుడైన శరత్ కుమార్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని తిరుచెందూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులకు 9 లక్షల రూపాయలతో పట్టుబడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో భారీ మొత్తం నగదు తీసుకుని సంచరించడం నేరమన్న సంగతి తెలిసిందే. కాగా, ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బును ట్రెజరీలో జమ చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఎన్నికల సందర్భంగా తమిళనాట ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు.