: ఈ నెల 15న ఎంసెట్.. ఏర్పాట్లు పూర్తి!: తెలంగాణ ఎంసెట్ కన్వీనర్
ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షను తెలంగాణలో ఈనెల 15న నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ఎస్‌వీ రమణారావు చెప్పారు. ఎంసెట్ పరీక్ష నిర్వహించిన అనంతరం అదే రోజు కీ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంసెట్ ఫలితాలు మే 27న ప్రకటించనున్నారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. కాగా, ఎంసెట్ లో 1,44,510 మంది ఇంజనీరింగ్ పరీక్షకు దరఖాస్తులు చేసుకోగా, 1,02,012 మంది అగ్రికల్చర్, మెడికల్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు.