: మరి ఆ చట్టం ప్రకారం మోహన్ భగత్ ను కూడా అరెస్టు చేస్తారా?... సోషల్ మీడియాలో చర్చ!
భారతదేశ మ్యాపులో కానీ, ఆన్ లైన్ లో కానీ, ముద్రణలో కానీ భారతదేశ మ్యాపులో మార్పులు చేర్పులు చేస్తే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్షతోపాటు, కోటి రూపాయల నుంచి వంద కోట్ల రూపాయల వరకు జరిమానా విధించే చట్టాన్ని చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఇటీవల జమ్మూకాశ్మీర్ ను పాకిస్థాన్ లో, అరుణాచల్ ప్రదేశ్ ను చైనాలో కలిపినట్టు భారతదేశ మ్యాప్ ఒకటి సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో మోదీ ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు ప్రకారం భారతదేశ మ్యాపును ఎవరైనా మార్చి చూపిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తెలుస్తోంది. అలాంటప్పుడు భారతదేశ మ్యాపును మార్చి చూపించే ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగత్ ను బీజేపీ ప్రభుత్వం అరెస్టు చేస్తుందా? ఎందుకంటే, పాకిస్ధాన్, బంగ్లాదేశ్ లు భారతదేశంలో అంతర్భాగాలుగా ఉన్న మ్యాపును ఆర్ఎస్ఎస్ తన అధికారిక మ్యాప్ గా పేర్కొంటుంది. ఇంకొన్ని మ్యాపుల్లో ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, శ్రీలంక, నేపాల్ దేశాలను కూడా భారత దేశంలో చూపిస్తుంది. మరి ఆయనను శిక్షిస్తారా? అంటూ సోషల్ మీడియాలో చర్చలతో పాటు, ఫోటోలు షేర్ అవుతున్నాయి. అదే సమయంలో పశ్చిమ జమ్మూకాశ్మీర్ లోని కొంతభాగం పాకిస్థాన్ లోనూ, ఈశాన్యంలోని అక్సాయిచిన్ ప్రాంతం చైనాలోనూ ఉన్నప్పటికీ వాటిని భారత్ మ్యాపుల్లో చూపించుకుంటున్నాం. దీంతో వీటిపై ఎవరికి శిక్ష విధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.