: హోంమంత్రి ఛైర్మన్‌గా హైదరాబాద్ లో ‘భరోసా’ కేంద్రం.. అన్యాయం జరిగితే వెంటనే ఫోన్ చేయండంటోన్న పోలీసులు
వివక్షకు గురవుతున్న మహిళలకు, ఆపదలో ఉన్న చిన్నారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా సైఫాబాద్‌లోని హాకా భవన్‌లో ‘భరోసా’ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రానికి రాష్ట్ర హోంమంత్రి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. అత్యాచార బాధితులు, వివక్షకు గురవుతోన్న మహిళలు, చిన్నారులు తమ సమస్యలను భరోసా కేంద్రం దృష్టికి తీసుకువచ్చి రక్షణ పొందవచ్చని ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వివక్షకు గురికావడం, ఏదైనా విషయం పట్ల తమకు అన్యాయం జరగడం వంటి సమస్యలపై 100 నెంబర్‌కు ఫోన్ చేసినా ‘భరోసా’ కేంద్రం ద్వారా రక్షణ పొందవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. చిన్నారులు ప్రత్యేకంగా 1098 నెంబర్‌కు ఫోన్ చేసి సాయం పొందవచ్చని పోలీసులు తెలిపారు. ‘భరోసా’ కేంద్ర ప్రారంభ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్‌శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, అదనపు సీపీ స్వాతిలక్రా తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.