: ప్లాస్టిక్ బ్యాన్ చేసినందుకు బెంగ‌ళూరులో పూజలూ బంద్!


ప్లాస్టిక్ బ్యాన్ చేసినందుకు బెంగ‌ళూరులోని దేవాల‌యాల్లో నిర్వ‌హించే ప‌లు పూజలూ బందయ్యాయి. పూజల కోసం గుడికి వెళుతోన్న భక్తులు పూజలు చేయించకుండానే ఇంటికి తిరిగొచ్చేస్తున్నారు. ప‌లు ప్ర‌సిద్ధ మందిరాలు నిన్నటి నుంచి పూజ‌లు నిలిపివేశాయి. ఈ మేర‌కు ఆల‌యాల వ‌ద్ద నోటీసు బోర్డుల‌పై మే6 నుంచి పూజ‌లు నిలిపేస్తున్నామంటూ పేర్కొన్నాయి. ప్లాస్టిక్ బ్యాన్‌తో త‌క్కువ ధ‌ర‌కు పూజ‌లు అందించ‌లేమ‌ని ఆల‌య అధికారులు అంటున్నారు. ఇంతకీ, ఈ ప్లాస్టిక్ బ్యాన్‌కి, పూజ‌ల‌కి సంబంధం ఏంట‌ని అనుకుంటున్నారా..? పూజ అనంత‌రం ప్ర‌త్యేకంగా దేవుడి ప్ర‌సాదం అందిస్తారు. ప్ర‌సాదం ఇవ్వ‌నిదే పూజ పూర్త‌యింద‌ని భావించ‌బోం. అయితే ఈ ప్ర‌సాదాన్ని అందించే ప్లాస్టిక్ క‌ప్స్ పై నిషేధం ఉండ‌డంతో.. అల్యూమినియంతో త‌యారుచేసే క‌ప్పుల‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధ‌ర ఎక్కువే. దీంతో కొన్ని ఆల‌యాల‌పై పూజ‌లు నిర్వ‌హించ‌బోమ‌ని నోటీసులు క‌నిపిస్తే, మ‌రి కొన్ని ఆల‌యాల్లో స‌త్య‌నారాయ‌ణ పూజ వంటి ప్రత్యేక పూజ‌ల‌కు ఇన్నాళ్లూ వ‌సూలు చేసిన రూ.10కి బ‌దులుగా రూ.25వ‌సూలు చేస్తున్నారు. లేదంటే ప్ర‌సాదాల కోసం భ‌క్తుల‌ను ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకోవాలంటూ పూజారులు స‌ల‌హా ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News