: 'ప్రచారం' కోసం... తన భుజంపై తొమ్మిదంగుళాల స్థలాన్ని అమ్మేసిన అధ్లెట్!
రియో ఒలింపిక్స్ దగ్గర పడుతున్నాయి. దీంతో ఆటగాళ్ల చుట్టూ ఎండార్స్ మెంట్లు క్యూ కడుతున్నాయి. ఆటల పండుగలో ప్రచారం పొందడం ద్వారా వినియోగదారులను పెంచుకోవాలని భావిస్తున్న కంపెనీలు అధ్లెట్లను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఒలింపిక్ రిలే రన్నర్ నిక్ సైమండ్స్ తన శరీరంలో స్పేస్ ను అమ్మకానికి పెట్టాడు. తన కుడి భుజంపై 9 అంగుళాల స్థలంలో యాడ్ ముద్రించుకోవచ్చని కంపెనీలకు ఆహ్వానం పలికాడు. ఈ క్రమంలో చదరపు ఇంచుకి ధర నిర్ణయిస్తూ ఈబే వేలం సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. దీంతో అతని భుజంపై ఆ చోటును సదరు సంస్థ అమ్మిపెట్టింది. వేలంలో టీ మొబైల్ కంపెనీ 14,51,835 (21,000 డాలర్లు) రూపాయలకు ఆ చోటును కొనేసింది. ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానున్న రియో ఒలింపిక్స్ లో భుజంపై టాటూతో నిక్ సైమండ్స్ ఆకర్షణగా నిలవనున్నాడు.