: హెచ్‌సీయూలో రెండుసార్లు పర్యటించారు.. కేర‌ళ‌లో జ‌రుగుతోన్న అన్యాయం క‌నిపించ‌డం లేదా? రాహుల్ గాంధీకి వెంక‌య్య సూటి ప్ర‌శ్న‌


కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో రెండు సార్లు ప‌ర్య‌టించారని, మ‌రి కేర‌ళ‌లో దుండ‌గులు ఓ విద్యార్థినిని అత్యాచారం చేసి, హ‌త్య‌చేస్తే అక్క‌డ ఎందుకు ప‌ర్య‌టించ‌డం లేద‌ని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు ప్ర‌శ్నిస్తూ ట్వీట్ చేశారు. కేర‌ళ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అక్క‌డి విష‌యాలు కాంగ్రెస్ కు క‌న‌ప‌డ‌డం లేద‌ని వెంక‌య్య వ్యంగ్యంగా అన్నారు. హెచ్‌సీయూలో ఏకంగా రెండుసార్లు ప‌ర్య‌టించిన రాహుల్.. మ‌రి కేర‌ళ‌లో ఎందుకు ప‌ర్య‌టించ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నేడు భార‌త మొట్ట‌మొద‌టి నోబెల్ గ్ర‌హీత‌ రవీంద్రనాథ్ ఠాగూర్‌ జయంతి సందర్భంగా ఆయ‌న‌కు అభివాదం తెలుపుతున్నట్లు వెంకయ్య మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News