: మూడు రోజుల్లో 88 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకున్న షీటీమ్స్.. బీటెక్ విద్యార్థులే అధికం
హైదరాబాద్‌లో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతోన్న పోకిరీలకు షీటీమ్స్ ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వీధులు, బస్టాండ్లు, రోడ్లపై అమ్మాయిలను వేధిస్తోన్న ఈవ్‌టీజర్లను ఏ మాత్రం ఉపేక్షించకుండా అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లో కేవలం మూడు రోజుల్లో 88 మంది ఈవ్‌టీజర్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఎక్కువగా బీటెక్ విద్యార్థులే ఉండడం గమనార్హం. పెళ్లైన యువకులు, వృద్ధులు సైతం అమ్మాయిల పట్ల వెకిలి చేష్టలకు పాల్పడి అరెస్టయిన వారిలో ఉన్నారు. అమ్మాయిలపై రెచ్చిపోయి కామెంట్లు చేస్తూ షీటీమ్స్ చేతికి చిక్కుతున్నారు. పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుంటోన్న షీ టీమ్స్ వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఒకటి కంటె ఎక్కువ సార్లు ఈవ్‌టీజింగ్ చేస్తూ తమకు చిక్కితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.