: పోలీస్ స్టేషన్ ను జప్తు చేసుకున్న విజయవాడ నగరపాలక సంస్థ
పోలీస్ స్టేషన్ ను జప్తు చేసిన అరుదైన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడలోని పాల ఫ్యాక్టరీ వద్ద నున్న రైల్వే పోలీస్ స్టేషన్ ను విజయవాడ నగరపాలక సంస్థ జప్తు చేసింది. ఏళ్లుగా ఆస్తిపన్ను చెల్లించకపోవడంతో అది కొండంతై కూర్చుంది. దీంతో ఎన్నిసార్లు నోటీసులు పంపినా ఫలితం లేకపోవడంతో ముందుకు కదిలిన నగరపాల సంస్థ అధికారులు దానిని జప్తు చేశారు. విజయవాడ నగరపాలక సంస్థకు రైల్వే పోలీస్ స్టేషన్ కోటి రూపాయల ఆస్తిపన్ను బకాయిపడిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.