: జాదవ్ పూర్ యూనివర్సిటీలో వివాదానికి ఆజ్యం పోసిన బీజేపీ అనుబంధ విద్యార్ధి సంస్థ
యూనివర్సిటీల్లో వివాదాలు రేపడం ద్వారా బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ ప్రతిష్ఠను పెంచుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా జాదవ్ పూర్ యూనివర్సిటీలోని ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో ఓ సినిమా ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. వారి ప్రయత్నాన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. కోడ్ అమలులో ఉండగా, బయటి వ్యక్తులను యూనివర్సిటీలోకి రప్పించి సినిమా ప్రదర్శించడం సరికాదని వారు హితవు పలికారు. దీంతో రెండు వర్గాల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి సంబంధం లేని, ఏబీవీపీకి దన్నుగా నిలిచేందుకు వచ్చిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, హెచ్ సీయూ వివాదం ముగిసిన తరువాత జేఎన్ యూ వివాదం, తాజాగా జాదవ్ పూర్ యూనివర్సిటీలో సినిమా వివాదం, ఇలా వరుస వివాదాలతో ఏబీవీపీ బలంపుంజుకోవాలని భావిస్తోంది.