: మ్యాచ్ ఫిక్సింగ్ ఆపడం కష్టం: కోహ్లీ సంచలన వ్యాఖ్యలు


ఎంత నియంత్రణ ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ ఆపడం కష్టమని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ప్రసారమైన ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ, ఎవరైనా తప్పు చేయాలని అనుకుంటే వారిని ఎవరూ ఆపలేరని అన్నాడు. సచిన్ తో క్రికెట్ ఆడాననడం ఇప్పటికీ తనకు కలలా అనిపిస్తుందని అన్నాడు. సచిన్ తన ఆరాధ్య క్రికెటర్ అని చెప్పాడు. మైదానంలో తానెలా ఆడాను? అనే దానిని పట్టించుకోవాలి తప్ప, మైదానం వీడిన తరువాత తన గురించి పట్టించుకోకూడదని అభిమానులకు హితవు పలికాడు. టెస్టు క్రికెట్ ప్రయాణం లాంటిదని కోహ్లీ తెలిపాడు. అది ఆటగాళ్లు తమను తాము తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. దూకుడుగా ఆడడమే తనను క్రికెట్ లో ఉన్నతస్థానాలు అధిరోహించేలా చేసిందని, అందుకే దూకుడుగా ఆడడాన్ని వదులుకోనని స్పష్టం చేశాడు. తన జీవితంలో క్రికెట్ ను మించినది ఏదీ లేదని కోహ్లీ తెలిపాడు.

  • Loading...

More Telugu News