: రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చి దిద్దుతాం: చంద్రబాబు
కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ రైతులతో ముఖాముఖిలో పాల్గొంటున్నారు. ఉద్యాన పంటల రైతులకు రుణ ఉపశమన పత్రాలను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రుణు ఉపశమన పత్రాల పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వ్యవసాయం చేసే వారి ఆదాయం తక్కువగా ఉందని, ఆ పరిస్థితి నుంచి వారు బయట పడేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఉద్యానవన రైతులకు రూ.67 కోట్లతో రుణ ఉపశమనం కలగజేశామని తెలిపారు. పులివెందులలో ప్రతీ ఎకరాకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చి దిద్దుతామని అన్నారు.