: తుమ్మలబయలులో యాక్సిడెంట్ ఎఫెక్ట్!... శ్రీశైలం ఘాట్ లో ట్రాఫిక్ జామ్!


శ్రీశైల క్షేత్రానికి దారి తీసే ఘాట్ రోడ్డులో నేటి ఉదయం నుంచి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం తుమ్మలబయలు వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదమే ఈ ట్రాఫిక్ జామ్ కు కారణంగా నిలిచింది. తుమ్మలబయలు వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మల్లన్న భక్తులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు క్షతగాత్రులను శ్రీశైలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో ఢీకొన్న రెండు బస్సులు ఇరుకుగా ఉన్న ఘాట్ రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. వీటిని అక్కడి నుంచి తొలగించేందుకు చేస్తున్న యత్నాలు ఫలించడం లేదు. దీంతో రోడ్డుకు ఇరువైపులా చాంతాడంత పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.

  • Loading...

More Telugu News