: ‘ఫ్యాన్’ కింద నుంచి ‘సైకిల్’పైకి ఎస్వీ!... చంద్రబాబు సమక్షంలో సొంత గూటికి కర్నూలు ఎమ్మెల్యే!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి హ్యాండిచ్చి టీడీపీలో చేరిపోయారు. వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాగా ఉన్న కర్నూలు నుంచి మొదలైన జంపింగ్ ల పర్వం... ఆ జిల్లాలో ఆ పార్టీని దాదాపుగా జీరో స్థాయికి చేర్చేలానే ఉంది. ఇప్పటికే ఆ జిల్లా నుంచి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జెండా మార్చేయగా, తాజాగా అదే జిల్లాలో మరో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నారు. కర్నూలు శాసనసభ్యుడిగా ఉన్న ఎస్వీ మోహన్ రెడ్డి నేడు కర్నూలులోనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తన సొంత గూటికి చేరనున్నారు. నిన్ననే వైసీపీకి రాజీనామా చేసిన ఎస్వీ మోహన్ రెడ్డి... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఖరి కారణంగానే తాను పార్టీ మారుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్వీతో పాటు ఆయన అనుచరవర్గం కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరనుంది.

  • Loading...

More Telugu News