: కాంగ్రెస్ పార్టీ... భారత ఆత్మ!: ‘సేవ్ డెమోక్రసీ’లో మన్మోహన్ ఉద్ఘాటన


రాజకీయవేత్తగా మారిన ఆర్థిక రంగ నిపుణుడు మన్మోహన్ సింగ్... దేశానికి ప్రధానిగా కీలక బాధ్యతలు చేపట్టారు. ఏకబిగిన పదేళ్ల పాటు ఆయన దేశాన్ని పాలించారు. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా, ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం నేపథ్యంలో మాజీ ప్రధానిగా మారిపోయారు. ఈ క్రమంలో విపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ పార్టీ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘సేవ్ డెమోక్రసీ’ పేరిట నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన బీజేపీపైనే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గల్లంతు కాక తప్పదన్న బీజేపీ విమర్శలపై ఆయన ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. ‘‘బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెబుతున్నారు. దేశానికి కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పిస్తామని చెబుతున్నారు. కానీ, మోదీ ప్రభుత్వానికి నేను ఒకటే చెబుతున్నా. కాంగ్రెస్ అనేది భారత ఆత్మ’’ అని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News