: షిర్డీ నాథుడి సేవలో ప్రధాని సతీమణి


ప్రధాని నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ శుక్రవారం మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. అలాగే, నాసిక్ త్రయంబకేశ్వరాలయాన్ని కూడా సందర్శించారు. షిర్డీ ఆలయానికి వచ్చిన ఆమె సాయినాథుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ అధికారి బాజీరావ్ షిండే ప్రధాని సతీమణికి శాలువా కప్పి సత్కరించారు. అలాగే, సాయిబాబా విగ్రహాన్ని బహూకరించారు. అనంతరం జశోదాబెన్ షిర్డీకి సమీపంలోనే ఉన్న త్రయంబకేశ్వర ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.

  • Loading...

More Telugu News