: ఉప్పల్ స్టేడియంలో పురుగుల స్వైర విహారం... క్రికెటర్ల అవస్థలు


ఐపీఎల్ 2016లో భాగంగా హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్ కు పురుగులు ఇబ్బందికరంగా పరిణమించాయి. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన జోరు వానతో సాయంత్రానికి పురుగులు భారీ సంఖ్యలో చేరాయి. స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుగులో అవి స్వైర విహారం చేస్తుండడంతో ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు, అంపెయిర్లు, ప్రేక్షకులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో క్రికెటర్లు తమ ముఖంపైకి వస్తున్న పురుగులను పక్కకు నెడుతూనే ఆటను కొనసాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News