: ఏపీకి వెళ్లేందుకు సమీపిస్తున్న గడువు... చర్యలు వేగవంతం


జూన్ నుంచి అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో నూతన సచివాలయం నుంచి పరిపాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్యలు ఊపందుకున్నాయి. ప్రతీ శాఖ నుంచి తొలి విడతగా ఉద్యోగుల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ టక్కర్ శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఎంత మంది ఉండాలి, తాత్కాలిక సచివాలయానికి ఎంత మంది తరలి వెళ్లాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలుగా ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదానికి వెళ్లింది. ఏడాది పాటు వారంలో ఐదు రోజులు మాత్రమే పనిదినాలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News