: కర్ణాటకలానే తెలంగాణ కూడా వ్యవహరిస్తోంది!: చంద్రబాబు


'నీటితోనే భవిష్యత్తు' ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. నీటి సంరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల నీటి కుంటలను నిర్మించనున్నామని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరంలో శుక్రవారం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ... అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై చేస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతోనే నీటి సమస్య ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు తెలంగాణ కూడా అదే విధంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News